యాపిల్‌ హెడ్‌ఫోన్స్‌ ఖరీదు రూ. 80లక్షలు

By udayam on December 31st / 9:41 am IST

శాన్‌ఫ్రాన్సిస్కో: విలాసవంతమైన జీవితం గడిపే వారి కోసం విలాస వస్తువులు అందుబాటులోకి వస్తూనే ఉంటాయి. తాజాగా యాపిల్‌ రూపొందించిన తొలి హెడ్‌ఫోన్స్‌ను మరింత విలాసవంతంగా మలిచింది. రష్యన్‌ కంపెనీ కేవియర్‌, ఎయిర్‌పోడ్స్‌ మాక్స్‌ను స్వచ్చమైన బంగారంతో రూపొందించింది.

ఎయిర్‌పోడ్స్‌ మాక్స్‌ ఇయర్‌ కప్స్‌ను యాపిల్‌ కంపెనీ వాస్తవంగా అల్యూమినియంతో రూపొందిస్తోంది. అయితే బాగా ప్రాచుర్యం పొందిన గ్యాడ్జెట్స్‌ను లగ్జరీ ఐటమ్స్‌గా మలిచే రష్యన్‌ కంపెనీ కేవియర్‌ వీటిని ప్యూర్‌ గోల్డ్‌తో రూపొందించింది. అంతేకాదు, మెష్‌ హెడ్‌బ్యాండ్‌ను అరుదైన క్రోకొడైల్‌ లెదర్‌తో అలంకరించింది.

దీంతో దీని ఖరీదు 1.08 లక్షల డాలర్లుగా ప్రకటించింది. అంటే సుమారు రూ. 80 లక్షలన్నమాట! వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా (కస్టమ్‌ మేడ్‌) వీటిని పరిమితంగానే తయారు చేయనున్నట్లు కేవియర్‌ పేర్కొంది.

కొత్త ఏడాది (2021)లో ఈ హెడ్‌ఫోన్స్‌ మార్కెట్లో విడుదల చేస్తారట. కాగా మొదట్లో ఎయిర్‌పోడ్స్‌ మ్యాక్స్‌ పేరుతో యాపిల్‌ తొలిసారి రిలీజ్ చేసిన హెడ్‌ఫోన్స్‌ ధర రూ. 59,900.