దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంలో సిబిఐ డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కమిల్ వదావన్, ధీరజ్ వదావన్లపై కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణం విలువ రూ.34,615 కోట్లుగా పేర్కొంది. ముంబైలో ఈ బ్యాంకుకు ఉన్న 15 కార్యాలయాల్లో ఒకేసారి సోదాలు జరిపిన సిబిఐ పలు కీలక ఆధారాలను సైతం స్వాధీనం చేసుకుంది. బ్యాంకుకు చెందిన నగదును ప్రమోటర్లకు చెందిన వేరే కంపెనీలకు అక్రమ పద్దతుల్లో తరలించారని సిబిఐ గుర్తించింది.