లాలూపై మూసేసిన కేసులో మళ్ళీ సిబిఐ విచారణ

By udayam on December 26th / 8:24 am IST

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఒక అవినీతి కేసును సీబీఐ రీఓపెన్ చేసింది. జేడీయూతో కలిసి బీహార్ లో ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నెలల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయపరంగా కలకలం రేపుతోంది. యూపీఏ-1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల్లో లాలూ ప్రసాద్ అవినీతికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి 2018లో సీబీఐ విచారణను ప్రారంభించింది. అయితే 2021 మే నెలలో విచారణను క్లోజ్ చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ కేసును సీబీఐ తిరగతోడింది.

ట్యాగ్స్​