తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కొడుకు, ఎంపి కార్తిపై సిబిఐ మరో కొత్త కేసు పెట్టింది. యూపీఎ హయాంలో కార్తీ రూ.50 లక్షలు తీసుకొని 250 మంది చైనీయులకు వీసాలు అందించారని సిబిఐ ప్రధాన ఆరోపణ. అయితే ఈ కేసు అనంతరం ఈరోజు తెల్లవారుఝామున చిదంబరం ఇంట్లో తనిఖీలు చేపట్టింది. దీంతో పాటు కార్తీకి దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. దీనిపై కార్తి స్పందిస్తూ రికార్డు స్థాయిలో మా ఇంట్లో సిబిఐ దాడులు చేసిందని చెప్పుకొచ్చారు.