ఫ్యూచర్​ – రిలయెన్స్​ డీల్​కు సిసిఐ ఓకె

By udayam on November 21st / 8:20 am IST

ఫ్యూచర్​గ్రూప్​ తన వ్యాపారాన్ని రిలయెన్స్​ లో కలిపే డీల్​కు కాంపిటీషన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా (సిసిఐ) అంగీకారం వెల్లడించింది. దీంతో మరో ఈ కామర్స్​ దిగ్గజమైన అమెజాన్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఇందుకు సంబంధించి సిసిఐ ట్వీట్​ చేస్తూ.. ‘‘మా కమిషన్​ ఫ్యూచర్​ గ్రూప్​కు చెందిన రిటైల్​, హోల్​సేల్​, లాజిస్టిక్స్​ అండ్​ వేర్​ హౌసింగ్​ బిజినెస్​ను రిలయెన్స్​ రిటైల్​ వెంచర్స్​ లిమిటెడ్​, రిలయెన్స్​ రిటైల్​ అండ్​ ఫ్యాషన్​ లైఫ్​స్టైల్​ లిమిటెడ్​లో కలిపేయడానికి అంగీకరిస్తోంది” అని పేర్కొంది.

రూ.24,713 వేల కోట్లుగా ఉన్న ఈ డీల్​కు మొదటి నుంచీ అమెజాన్​ అడ్డుపడుతోంది. ఫ్యూచర్​ కూపన్స్​లో తమకు వాటా ఉన్నందున ఈ డీల్​కు అంగీకారం తెలపొద్దంటూ సిసిఐ, సెబీలకు అమెజాన్​ లేఖలు రాసింది.

సిసిఐ అంగీకారంతో ఇప్పుడు రిలయెన్స్​ రిటైల్​ ఫ్యూచర్​ గ్రూప్​కు దేశవ్యాప్తంగా ఉన్న 1800 స్టోర్లను నడపడానికి ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. ఫ్యూచర్​ గ్రూప్​ యొక్క బిగ్​ బజార్​, ఎఫ్​బిబి, ఈజీడే, సెంట్రల్​, ఫుడ్​హాల్​ ఫార్మాట్స్​కు 420 పట్టణాల్లో స్టోర్లు ఉన్నాయి.