సుప్రీం: సీఈసీ నియామకంపై 72 ఏళ్ళుగా అలసత్వం దేనికి?

By udayam on November 23rd / 12:59 pm IST

కేంద్ర ఎన్నికల కమిషనర్​ నియామకంపై కోర్టులో కేసు పెండింగ్​ లో ఉండగానే.. కేంద్రం కొత్త సీఈసీ ని ఎలా నియమించిందని సుప్రీంకోర్ట్​ ఈరోజు ఫైర్​ అయింది. దీంతో పాటు కొత్తగా ఈ పదవిలోకి వవ్చిన అరుణ్​ గోయల్​ నియామక పత్రాలను తమ ముందు ఉంచాలని పేర్కొంది. రాజ్యాంగ బద్ధంగా ఉన్న ఖాళీని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ లబ్దికోసం వినియోగించుకుంటున్నాయన్న సుప్రీం.. 72 ఏళ్ళగా ఈసీ, సీఈసీ ల నియామకంపై చట్టం తీసుకురావడం దారుణమని పేర్కొంది. ‘ఈ వ్యవస్థ సరిగ్గా లేదని మేం చెప్పం. అయితే ఈ పదవిలో ఉండే వారు తాము చెప్పిన దానికి ‘యస్​’ కొట్టాలని కేంద్రం భావిస్తోంది. అలాంటి వారికే పట్టం గడుతోంది. ప్రధాని తప్పు చేస్తే చర్యలు తీసుకునే దమ్ము ప్రస్తుతం ఉన్న ఈసీ సభ్యులకు ఉండడం లేదు’ అని ఘాటుగానే వ్యాఖ్యానించింది.

ట్యాగ్స్​