తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. 50 కేజీల బస్తా ధరను రూ.20–30 వరూ కంపెనీలు పెంచేశాయి. నిన్నటి నుంచే ఈ పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. ఇంధన వ్యయాలు పెరగడంతో పాటు ముడి పదార్థాల కొరత, ఉన్న వాటి రేట్లు భారీగా పెరగడం కూడా సిమెంట్ ధరల పెంపులో కీలకంగా మారాయి. దీంతో అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, కేవీపీ, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, సాగర్ సిమెంట్స్, దాల్మియా భారత్, శ్రీ సిమెంట్, రామ్ కో సిమెంట్స్ కంపెనీలు ధరలు పెంచేశాయి.