పఠాన్​ కు సెన్సార్​ బోర్డ్​ ఝలక్​.. మూవీని తిప్పి పంపేశారు

By udayam on December 29th / 12:34 pm IST

వచ్చే ఏడాది జనవరి 26 న రిలీజ్​ కు సిద్ధమవుతున్న షారూక్​ ఖాన్​ పఠాన్​ కు సెన్సార్​ బోర్డ్​ షాక్​ ఇచ్చింది. ఈ మూవీలోని పలు సీన్లకు అభ్యంతరం చెప్పిన బోర్డ్​.. ఆ సీన్లను మార్చడం,లేదా ఎడిట్​ చేయడం చేస్తేనే సెన్సార్​ సర్టిఫికెట్​ జారీ చేస్తామని వెల్లడించింది. దీంతో బోర్డ్​ పేర్కొన్న సీన్లలో మరోసారి ఎడిటింగ్​ చేయడానికి యూనిట్​ సిద్ధమైంది. ఈ మూవీలోని బేషరమ్​ సాంగ్ లో దీపికా ధరించిన బికినీ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​