దేశవ్యాప్తంగా పది లక్షలకు పైగా రేషన్ కార్డులను కట్ చేయడానికి కేంద్రం సిద్ధమైంది. తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించిన రేషన్ పొందుతున్న వారికి ఈ కార్డులను కట్ చేయాలని చూస్తోంది. ప్రస్తుతం దీనిపై సమీక్షిస్తున్న కేంద్ర అధికారులు ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. మొత్తం లిస్ట్ తయారైన వెంటనే రేషన్ డీలర్లకు ఈ జాబితాను పంపించనుంది. ఆదాయపు పన్ను చెల్లించే వారు, 6 ఎకరాల భూమి ఉన్న వ్యక్తుల కార్డులను రద్దు చేయనుంది.వీటితో పాటు రేషన్‌ను విక్రయిస్తూ కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకుంది.