దేశంలో తమ బ్యాంకుకు ఉన్న 13 శాతం శాఖల్ని మూసేయాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది. నష్టాలు తీసుకొచ్చే బ్రాంచుల్ని పెద్ద బ్రాంచుల్లో కలిపేస్తూ దేశవ్యాప్తంగా కేవలం 600 శాఖలకే పరిమితం కావాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈ బ్యాంక్‌కు గత కొద్ది సంవత్సరాలుగా వస్తున్న నష్టాలను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ శాఖల తగ్గింపు ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి పూర్తి చేయనుంది.