జూన్​ 23న ఆత్మకూరు ఉప ఎన్నిక

By udayam on May 26th / 3:54 am IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్​ విడుదల చేసింది. మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి మే 30న గెజిట్​ విడుదల కానుండగా నామినేషన్లకు తుది గడువుగా జూన్​ 6, పరిశీలనకు జూన్​ 7, ఉపసంహరణకు జూన్​ 9 తుది తేదీలుగా ప్రకటించింది. జూన్​ 23న పోలింగ్​, 26న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్​