తెలుగు రాష్ట్రాల మధ్య మరో ఎన్​.హెచ్​.

By udayam on December 19th / 10:19 am IST

తెలంగాణ, ఏపి రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. రూ. 4,706 కోట్ల వ్యయంతో ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నాలుగు లేన్ల రహదారి కోసం ఇప్పటికే కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణౄనికి కూడా అనుమతులు వచ్చేశాయి. తెలంగాణలో 91 కి.మీ.లు, ఎపిలో 164 కి.మీ.లు ఈ హైవే నిర్మించనున్నారు.

ట్యాగ్స్​