ఏపీ స్కూల్స్​ కోసం కేంద్రం నుంచి భారీ నిధులు

By udayam on December 22nd / 6:07 am IST

నిధులు లేక కష్టాలు పడుతున్న ఏపీ సర్కార్ కు కేంద్రం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని పలు పాఠశాల భవనాల మర మత్తులు మరియు ఇతర మౌలిక వసతుల కల్పనకు సమగ్ర శిక్ష అభియాన్ కింద రూ.867 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి ఏకంగా రూ.867 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. వీటిలో రూ.823 కోట్లు ఖర్చు చేశారని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి వివరించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు.

ట్యాగ్స్​