దేశ ద్రోహం చట్టాన్ని సమీక్షిస్తున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. దీనిపై దేశంలోని అన్ని వర్గాల నుంచి వస్తున్న స్పందనలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాని మోదీ ఈ చట్టం దుర్వినియోగంపై దృష్టి సారించారని పేర్కొంది. ‘బ్రిటీష్ కాలంనాటి ఈ చట్టాన్ని పక్కన పెట్టేయాలని నిర్ణయించాం. దేశ సార్వభౌమత్యం పరిరక్షణకూ కట్టుబడి ఉంటూనే.. సిఆర్పీసీలోని 124ఏను (దేశ ద్రోహ చట్టం)ను సమీక్షిస్తున్నాం’ అని సుప్రీం కోర్టులో కేంద్రం ప్రమాణ పత్రం దాఖలు చేసింది.