కేంద్రం: డ్రైవింగ్​ స్కూల్లోనే లైసెన్స్​ జారీ

By udayam on May 10th / 6:34 am IST

ఇకపై డ్రైవింగ్​ స్కూల్​లోనే లైసెన్స్​లు జారీ చేసేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్​ శిక్షణా కేంద్రాల గుర్తింపు నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం ఇక్కడ శిక్షణ పొందిన వారికి ఇక్కడే లైసెన్స్​ జారీ చేసేలా చర్యలు చేపట్టింది. దీంతో రవాణా శాఖ ఆఫీసుకు వెళ్ళి డ్రైవింగ్​ టెస్ట్​లకు హాజరయ్యే అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు డ్రైవింగ్​ లైసెన్స్​ నిబంధనలు–2022 నోటిఫికేషన్​ను విడుదల చేసింది. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.

ట్యాగ్స్​