కేంద్రం: ఏపీ అప్పు రూ.4 లక్షల కోట్లు

By udayam on December 20th / 3:56 am IST

ఏపీ అప్పులకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్ సభలో వెల్లడించింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు అని పేర్కొంది. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గాయని, కానీ 2020-21 నాటికి అప్పుల పెరుగుదల 17.1 శాతంగా ఉందని వివరించింది. ఏపీ జీడీపీలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగిందని తెలిపింది.2021కి వచ్చేసరికి రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 36.5 శాతానికి పెరిగాయంది.

ట్యాగ్స్​