మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేయడంపై కేంద్రం సుప్రీంకోర్ట్ తలుపుతట్టింది. ఈ తీర్పును పున:సమీక్షించాలని కేంద్రం కోరుతూ పిటిషన్ వేసింది. తగిన విచారణ లేకుండా దోషుల విడుదల జరిగిందని, ఇలా చేయడం న్యాయసూత్రాలను ఉల్లంఘించినట్లవుతుందని తెలిపింది. గత మూడు దశాబ్దాలుగా వారి జైలు జీవితం తమిళనాడులో ఓ రాజకీయ సమస్యగా మారిందని, ఇలాంటి సున్నితమైన అంశాల్లో కేంద్రం సలహా అవసరమని అభిప్రాయపడింది. మొత్తం ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందిన వారని, మాజీ ప్రధానిని హత్యచేసి ఉగ్రవాదులుగా ముద్ర పడినవారికి క్షమాభిక్ష పెట్టడం అంతర్జాతీయంగా ప్రభావం చూపి స్తుందని పిటిషన్‌లో పేర్కొంది.