దేశంలో కొన్ని రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించే అంశంపై ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపేందుకు సుప్రీంకోర్ట్ కేంద్రానికి 3 నెలల గడువు ఇచ్చింది. జనాభా ప్రాతిపదికన హిందువులు ముస్లింల కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వారిని మైనారిటీలుగా పరిగణించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయంపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం తరపున న్యాయవాదులు వాదించిన నేపధ్యంలో సుప్రీం ఈ సూచనలు చేసింది. కేంద్రం చొరవ తీసుకుంటే సరిపోతుందని పేర్కొంది.