కేంద్రం: కాపులకు రిజర్వేషన్ల అంశంలో రాష్ట్రానిదే అధికారం

By udayam on December 22nd / 4:44 am IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కాపు సమాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించే అధికారి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి ప్రతిమా భౌమిక్ సమాధానమిచ్చారు. ‘విద్య, ఉపాధి కోసం కొత్తగా ఎవరినైనా ఓబీసీలలో చేర్చే ప్రతిపాదనలకు కేంద్రం అనుమతి అవసరం లేదు’ అని రాతపూర్వక సమాధానం ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103కి 2019లో జరిగిన సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం వరకూ ఈబీసీ రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉందని భౌమిక్ అన్నారు.

ట్యాగ్స్​