ఏపీకి కేంద్రం వరుస గుడ్ న్యూస్ లు అందిస్తూనే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను అందజేసిన కేంద్రం..తాజాగా మరో రూ. 900 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా 9 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. వీటికి ఏకంగా రూ.9,009 కోట్లు కేటాయించింది. మొత్తం 411 కిలోమీటర్ల నిడివి ఉన్న ఈ రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదించింది. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారులను ప్రతిపాదించింది.