విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన వేళ ఇకపై విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కేసులు తగ్గుతున్నప్పటికీ మాస్కులు ధరించడమే మంచిదని సూచించింది. కొవిడ్ కేసులు తగ్గడంతో ప్రయాణికులు మాస్కులు ధరించేందుకు ఉద్దేశించి విమానాల్లో చేసే జరిమానా/శిక్షార్హమైన చర్యలపై ఇకపై ఎలాంటి సూచనల్ని ప్రకటించాల్సిన అవసరం లేదని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ పేర్కొంది.