చలపతిరావు హఠాత్మరణం.. అంత్యక్రియలు బుధవారం

By udayam on December 26th / 4:41 am IST

టాలీవుడ్​ సీనియర్ విలక్షణ నటుల్లో ఒకరైన చలపతి రావు (78) ఆదివారం హఠాత్మరణం చెందారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా బంజారాహిల్స్‌లోని తన కుమారుడు రవిబాబు వద్ద ఉంటున్నారు. తన తండ్రి శనివారం అర్ధరాత్రి వరకూ బానే ఉన్నారని, ఆ తర్వాతే గుండెపోటుతో కుప్పకూలారని ఆయన కుమారుడు రవిబాబు వెల్లడించారు. మంగళవారం వరకు మహాప్రస్థానంలో ఫ్రీజర్‌లో పార్థివ దేహాన్ని ఉంచుతామని వెల్లడించారాయన తన తండ్రి అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తామన్నారు. చలపతిరావుకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. రెండు రోజుల క్రితమే సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందగా, ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్స్​