చంద్రబాబు: రాజమండ్రిలో జగన్​ రోడ్​ షో చేయొచ్చు.. మేం కుప్పంలో చేస్తే తప్పా?

By udayam on January 4th / 12:51 pm IST

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో చంద్రబాబు తన కాన్వాయ్​ నుంచి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పక్షాల సభలు ప్రభుత్వ దయ, దాక్షిణ్యాలతో జరిగేలా ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు. సీఏం వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి మాత్రం రాజమహేంద్రవరంలో రోడ్‌షో, సభ నిర్వహించారని విమర్శించారు. అధికారపార్టీలకు, ప్రతిపక్షాలకు నిబంధనల్లో తేడాలెందుకని ప్రశ్నించారు.

ట్యాగ్స్​