చంద్రబాబు : తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసే ప్రసక్తే లేదు

By udayam on December 22nd / 5:58 am IST

ఏపీ – తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసే ప్రసక్తే లేదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల..తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగుటుందని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఖమ్మంలో ఏర్పటు చేసిన టీడీపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు..ఏపీ – తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఐటీ స్థాపించాం. అప్పట్లో సెల్‌ఫోన్‌ బువ్వ పెడుతుందా అని ఎగతాళి చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా భార్యాభర్తలు కూడా ఉండలేరన్నారు.

ట్యాగ్స్​