టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూల్ పర్యటన లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా టీడీపీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ కొంతమంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులు, లాయర్లు చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో తాట తీస్తా అంటూ స్వరం పెంచారు. ‘రౌడీలకే రౌడీని.. మా ఆఫీసుకే వస్తార్రా.. చేతగాని దద్దమ్మల్లారా.. వాణ్ని పట్టుకొని తన్నండ్రా.. నా ఇంటికి వస్తావా నువ్. మా ఆఫీసుకే వస్తార్రా.. వాడిని పట్టుకొండి. పోలీసులూ మీరు నిద్రపొండి. ఖాకీ డ్రెస్ ఇప్పేయండీ. మీకు ఎందుకు ఉద్యోగాలు.. నేను అధికారంలో ఉన్నప్పుడు ఇలానే అనుకుంటే.. తరిమి తరిమి కొట్టేవాణ్ని.. ఎవర్రా రాయలసీమ ద్రోహీ? తమాషా అనుకోవద్దు.. నేను కనుసైగ చేస్తే.. రాష్ట్రంలో పరిస్థితి వేరేలా ఉంటుంది. నన్ను రెచ్చగొడుతున్నారు. నేను ఎవ్వరికీ భయపడను. తాట తీస్తా’ అని చంద్రబాబు ఆగ్రహంతో మాట్లాడారు.
చంద్రబాబుగారి ఆగ్రహం చూస్తుంటే… "అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిననాడు సాగరములన్నియు ఏకము కాకపోవు…" అంటూ సాగే తిరుపతి వెంకటకవుల పద్యం గుర్తుకు వస్తోంది.ఇది చంద్రబాబుగారి కర్నూలు జిల్లా పర్యటనలో చోటు చేసుకుంది#CBNInKurnool#RayalaseemaTDP#TDPforDevelopment pic.twitter.com/mPNWwV2tl0
— Telugu Desam Party (@JaiTDP) November 18, 2022