ఆ జీవోను భోగిమంటల్లో తగులబెట్టాలి : చంద్రబాబు

By udayam on January 12th / 11:07 am IST

అమరావతి: రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న జీవోను భోగిమంటల్లో తగులబెట్టాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు.

టీడీపీ జోనల్ ఇన్‌చార్జ్‌లు, పార్లమెంటు అధ్యక్షులు, సమన్వయకర్తలు, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లతో అయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటల్లో తగులపెట్టాలని పిలుపునిచ్చారు.

ఏకంగా 7 వరుస విపత్తులతో రైతులు పూర్తిగా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఇన్సూరెన్స్ అందక, ఇటు ఇన్‌పుట్ సబ్సిడి రాక రైతాంగం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ 2,700కోట్లు పెండింగ్ పెట్టారని మండిపడ్డారు. భారీవర్షాలకు తడిసి రంగుమారిన ధాన్యం కొనేవాళ్లు లేరని, దళారుల ఇష్టారాజ్యంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.