కుప్పం పర్యటన గురించి నెల ముందే డీజీపీకి సమాచారం ఇచ్చానని అయినా తన పర్యటను అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. రోడ్ షో చేయనివ్వకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన తన సొంత నియోజకవర్గంలోకి తనను ఏ చట్టం కింద ఆపుతున్నారని నిలదీశారు. ‘మీరు ఏ చట్టప్రకారం జీవోను తీసుకొచ్చారు. ఇప్పటికే చట్టం అమల్లో ఉంటే కొత్త జీవో ఎందుకు? ప్రభుత్వం తీరుతో విసిగి పోయిన ప్రజలు మా సభలకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ సభలను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
🔥🔥🔥 #CBNInKuppam pic.twitter.com/uotWwokKd1
— iTDP Official (@iTDP_Official) January 4, 2023