సైక్లోన్ అసాని ధాటికి విదేశాల నుంచి ఓ రథం పై భాగం శ్రీకాకుళం జిల్లాలోని సున్నపల్లి తీరానికి కొట్టుకొచ్చింది. బంగారం వర్ణంతో ఉన్న ఇది మయన్మార్, మలేషియా, థాయిలాండ్ దేశాలకు చెందినది అయి ఉంటుందని భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం దీనిని గమనించిన గ్రామస్థులు దానిని తీరానికి తీసుకొచ్చారు. దీంతో దీనిని చూడడానికి సున్నపల్లి సమీపంలోని గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తుఫాను ధాటికే ఇది కొట్టుకు వచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు.