నేపాల్​ సుప్రీంకోర్ట్​ : చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేసి దేశం దాటించండి

By udayam on December 22nd / 4:49 am IST

సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభ‌రాజ్‌ను విడుదల చేయాల్సిందిగా నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇద్దరు అమెరికా టూరిస్టులను హత్య చేశారనే ఆరోపణలతో 2003 నుంచి చార్లెస్ శోభరాజ్ నేపాల్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనను విడుదల చేసిన 15 రోజుల్లో దేశం నుంచి పంపించాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. భారత, వియత్నాం మూలాలున్న ఈ ఫ్రెంచ్​ వ్యక్తి పలు హత్యా నేరాల్లో భాగం అయినట్లు నిరూపితం కావడంతో 20 ఏళ్ళుగా జైలులో మగ్గుతున్నాడు.

ట్యాగ్స్​