జనవరిలో ఐపిఎల్​ మెగా వేలం

By udayam on November 24th / 12:41 pm IST

వచ్చే ఏడాది ఐపిఎల్​ కోసం జరగనున్న ఆటగాళ్ళ మెగా వేలం వచ్చే ఏడాది జవవరి తొలి వారంలో జరగనుందని సమాచారం. ఇప్పటి వరకూ ఉన్న 8 జట్లు తాము రిటైన్​ చేసుకునే ఆటగాళ్ళ జాబితా ఇవ్వడానికి మరో 6 రోజులు మాత్రమే ఉన్న నేపధ్యంలో మెగా ఆక్షన్​ డేట్​ ఫైనల్​ చేయనుంది బిసిసిఐ. ఈ వేలాన్ని భారత్​లోనే నిర్వహించాలని కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 15వ ఎడిషన్​ ఐపిఎల్​ను ఏప్రిల్​ 2న చెన్నైలో ప్రారంభించాలని తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ మ్యాచ్​లో డిఫెండింగ్​ ఛాంప్​ చెన్నైను, ముంబై ఇండియన్స్​ ఢీకొట్టనుంది.

ట్యాగ్స్​