చెన్నై మైలాపూర్కు చెందిన శ్రీకాంత్ (65), అనురాధ (60)ల మృతి మిస్టరీ వీడింది. వీరిద్దరినీ వారింట్లో 20 ఏళ్ళుగా నమ్మకంగా పనిచేస్తున్న నేపాల్ డ్రైవర్ లాల్ కృష్ణ, హెల్పర్ రవిలే హత్య చేశారని పోలీసులు తేల్చారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన రోజునే వీరు రూ.40 కోట్ల డీల్ కోసం మాట్లాడుకున్నారని, అది విన్న మేం వీరిని హత్య చేసి డబ్బుతో పారిపోవాలని ప్రయత్నించామని విచారణలో ఒప్పుకున్నారు. హత్య అనంతరం ఇంట్లోని రూ.8 కోట్లను కాజేసి ఆంధ్రకు పారిపోతూ ఇక్కడ చిక్కారు.