ఫుల్‌గా తాగి ఈద్ పార్టీకి వెళ్ళిన ఓ వ్యక్తి అక్కడ బిర్యానీతో పాటు 1.50 లక్షల విలువ చేసే నగల్ని కూడా మింగేశాడు. ఓ మహిళ తన ఇంట్లో ఇచ్చిన ఈద్ పార్టీకి ఆమె స్నేహితురాలు బాయ్‌ఫ్రెండ్‌తో సహా వచ్చింది. ఫుల్‌గా తాగొచ్చిన అతడు బిర్యాని అనంతరం కప్‌బోర్డ్‌లో ఉన్న నగల్ని సైతం మింగేశాడు. దీంతో పోలీస్ కేసు పెట్టిన బాధితురాలు అతడు ఇదంతా నగల్ని కాజేయాలనే చేసినట్లు పోలీసుల విచారణలో ఇప్పుకున్నాడు. అతడిని ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేసి నగల్ని బయటకు తీశారు.