చెన్నై జోరు.. హైదరాబాద్​ బేజారు..

By udayam on September 30th / 6:22 pm IST

పటిష్ఠ ధోనీ సేనతో గురువారం జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ చెన్నై విజయంతో  ప్లే ఆఫ్స్​కు చేరుకుంది. చెన్నై బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు హైదరాబాద్​ జట్టులో సాహా 44 తప్పితో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. హాజిల్​ వుడ్​ 3, బ్రావో 2, ఠాకూర్​, జడేజాలు చెరో వికెట్​ తీశారు. దీంతో హైదరాబాద్​ 134 పరుగలతో సరిపెట్టుకుంది. ఆపై బ్యాటింగ్​కు దిగిన చెన్నై ఆది నుంచే బాదడం మొదలెట్టింది. ఈ క్రమంలో సులువుగా గెలుస్తుందనుకున్న మ్యాచ్​ను చివరి వరకూ పొడిగించి ఉత్కంఠకు తెరలేపింది. చివరి ఓవర్లో ధోనీ సిక్స్​తో మ్యాచ్​ను ముగించాడు.