చెన్నై జట్టులోనూ 3 కరోనా కేసులు

By udayam on May 3rd / 11:01 am IST

మహేంద్ర సింగ్​ సారధ్యంలోని చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టులో కరోనా కలకలం రేగింది. జట్టు సిఈఓ కాశి విశ్వనాథన్​, బౌలింగ్​ కోచ్​ లక్ష్మీపతి బాలాజితో పాటు జట్టు ప్రయాణించే బస్సు క్లీనర్​ కు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో ఈ ముగ్గురూ 10 రోజుల క్వారంటైన్​కు తరలింపబడ్డారు. మే 5 బుధవారం చెన్నై.. రాజస్థాన్​తో తలపడనుంది. ఇదే రోజు కోల్​కత్తా నైట్​రైడర్స్​లో సైతం 2 పాజిటివ్​ కేసులు వచ్చాయి. మిస్టరీ స్పిన్నర్​ వరుణ్​ చక్రవర్తితో పాటు సందీప్​ వారియర్లకు కరోనా పాజిటివ్​గా తేలడంతో ఈరోజు జరగాల్సిన కోల్​కత్తా, బెంగళూరు మ్యాచ్​ రద్దైంది.

ట్యాగ్స్​