ఐపిఎల్​ రారాజు ధోనీనే

By udayam on October 16th / 6:28 am IST

కోల్​కతాతో జరిగిన ఐపిఎల్​ ఫైనల్​లో ధోనీ సేన చరిత్ర సృష్టించింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన చెన్నై పటిష్ఠ కోల్​కతా బౌలింగ్​ లైనప్​ను ధాటిగా ఎదుర్కొని 192 పరుగులు చేసింది. రుతురాజ్​ 32, డుప్లెసిస్​ 86, ఉతప్ప 31, మోయిన్​ ఆలీ 37 పరుగులు చేసి ఇన్నింగ్స్​ను నిలబెట్టారు. ఆపై కోల్​కతా కూడా అచ్చం చెన్నై లానే ఇన్నింగ్స్​ను మొదలెట్టినప్పటికీ మిడిల్​ ఆర్డర్​ ఘోర వైఫల్యంతో కేవలం 165కే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో చెన్నై 4వ సారి కప్పును సొంతం చేసుకుంది.

ట్యాగ్స్​