వచ్చే ఏడాదీ ధోనీనే మా కెప్టెన్​ : చెన్నై

By udayam on October 17th / 6:57 am IST

వచ్చే ఏడాది ఐపిఎల్​ కోసం జరిగే మెగా వేలంలో రిటైనింగ్​ ఆప్షన్​ ఉంటే మేం ముందుగా ఉంచుకునే ప్లేయర్​ ఎం.ఎస్​.ధోనీనే అని చెన్నై జట్టు ప్రకటించింది. దీంతో ధోనీ మరో ఏడాది కూడా చెన్నైకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రిటైనింగ్​ కార్డ్​ ఉంటే దానిని మేం ధోనీ కోసమే వాడతాం. అతడే మా వచ్చే ఏడాది కెప్టెన్​ కూడా’ అని చెన్నై ప్రతినిధి ప్రకటించాడు. గత శుక్రవారం జరిగిన ఐపిఎల్​ ఫైనల్​ ముగిసిన అనంతరం మాట్లాడిన ధోనీ.. చెన్నై ఉంచుకునే 3 లేదా 4 గురు ప్లేయర్లలో నేనుండాలి అని అనుకోవట్లేదు అని ప్రకటించిన విషయం తెలిసిందే.