అయోధ్య: రూ.22 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్​

By udayam on June 22nd / 10:23 am IST

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాల రూపంలో వచ్చిన చెక్కుల్లో కొన్ని బౌన్స్​ అయ్యాయని విశ్వ హిందూ పరిషత్​ ప్రకటించింది. ఇలా బౌన్స్​ అయిన మొత్తం 15 వేల చెక్కుల మొత్తం విలువ రూ.22 కోట్లుగా పేర్కొంది. ఇలా రద్దు అయిన చెక్కుల మొత్తంతో కలిపి ఇప్పటి వరకూ అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.3,400 కోట్ల రూపాయల విరాళాలు అందాయని పేర్కొంది. అయితే చెక్కులు బౌన్స్​ కావడానికి గల కారణాలు తమకూ తెలియవని, దీనిపై బ్యాంకుల నుంచి వచ్చిన రిపోర్టుల మేరకు నివేదిక తయారు చేస్తామని తెలిపింది.

ట్యాగ్స్​