సిడ్నీ టెస్టులో రికార్లులు ఇవీ

By udayam on January 11th / 10:20 am IST

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత ఆటగాళ్ళైన చతేశ్వర్​ పుజారా, రిషబ్​ పంత్​లు రికార్డులు నెలకొల్పారు.

టెస్టుల్లో భారత్​ తరపున 6 వేల పరుగులు పూర్తి చేసిన 11వ బ్యాట్స్​మెన్​ పుజారా రికార్డు నమోదు చేశాడు. 32 ఏళ్ళ పుజారా 134 ఇన్నింగ్స్​లో ఈ రికార్డును అందుకున్నాడు.

అతని కంటే ముందు గవాస్కర్​ (117 ఇన్నింగ్స్​లు), కోహ్లీ (119), సచిన్​ టెండుల్కర్​ (120), వీరేంద్ర సెహ్వాగ్​ (123) రాహుల్​ డ్రావిడ్​ (125) ఇన్నింగ్స్​లో ఈ రికార్డును అందుకుంటే ఇప్పుడు పుజారా ఈ 134 ఇన్నింగ్స్​ల్లో ఈ రికార్డును అందుకున్నాడు.

రిషబ్​ పంత్​ అరుదైన రికార్డ్​

మూడో టెస్ట్​ ఆఖరు రోజు భారత వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ సైతం అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

ఆస్ట్రేలియాలో నాలుగో ఇన్నింగ్స్​లో 50 పరుగులు చేసిన పంత్​ ఆ ఘనత సాధించిన అత్యంత చిన్న వయసు వికెట్​ కీపర్​గా నిలిచాడు.

ఎప్పుడూ మిడిల్​ ఆర్డర్​లో అడుగున వచ్చే పంత్​ ఈసారి 3వ వికెట్​ పడిన వెంటనే బ్యాటింగ్​కు రావడంతో స్వేచ్ఛగా ఆడే అవకాశం లభించింది. దీంతో అతడు కేవలం 118 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు.

పంత్​ కేవలం 23 సంవత్సరాల 95 రోజుల వయసులోనే ఈ రికార్డును అందుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్​ ఆస్ట్రేలియా వికెట్​ కీపర్​ ఇయాన్​ హీలీ పేరిట ఉంది. అతడు 24 ఏళ్ళ 216 రోజుల వయసులో ఈ రికార్డును నెలకొల్పాడు.