ఎమ్మెల్యే కాలె యాదయ్యను అడ్డుకున్న గ్రామస్థులు..

By udayam on November 16th / 10:50 am IST

శుభోదయం కార్యక్రమంలో భాగంగా ప్రజలను పలుకరించి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు అల్లవాడ గ్రామానికి వెళ్లిన చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం అయింది. అల్లవాడ గ్రామస్తులు కాలె యాదయ్యను అడ్డుకుని, గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులూ జరగలేదని, రోడ్లు కూడా బాగోలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంటనే తమ ఊరి నుంచి వెళ్లిపోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు.ఇటీవలే గుండ్లపల్లిలో రసమయి బాలకిషన్ కాన్వాయ్‌పై యువకులు చెప్పులతో దాడి చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​