అభం శుభం తెలియని 4 ఏళ్ళ చిన్నారికి వాళ్ళ అమ్మమ్మ ఫుల్ బాటిల్ విస్కీ పట్టించడంతో బాలిక చనిపోయిన ఘటన లూసియానా రాష్ట్రంలోని బేటన్ రోగ్లో చోటు చేసుకుంది. బాలిక అమ్మమ్మ రోక్సానే రికార్డ్ (53) విస్కీ పట్టిస్తున్నప్పుడు బాలిక తల్లి కద్జా రికార్డ్ (29) సైతం పక్కనే ఉందని పోలీసులు తెలిపారు. దీంతో వీరిద్దరిపైనా ఫస్ట్ డిగ్రీ మర్డర్ ఛార్జెస్ రికార్డ్ చేసి కేసును విచారిస్తున్నారు. చిన్నారి రక్తంలో ఆల్కహాల్ శాతం 680గా గుర్తించారు.