కొవిడ్​ నిబంధనలపై వెనక్కి తగ్గిన చైనా

By udayam on December 7th / 10:19 am IST

చైనాలో కోవిడ్ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా చేస్తోన్న ఆందోళనలకు అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కోవిడ్ నియ‌మావ‌ళిని స‌డ‌లించింది. త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవాల‌న్న నిబంధ‌న‌ను ఎత్తివేసింది. ఈ మేరకు బీజింగ్‌లోని జాతీయ ఆరోగ్య కేంద్రం ఇవాళ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుదల చేసింది. వైర‌స్ సోకి ల‌క్ష‌ణాలు లేని వారు ఇక హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండ‌నున్నారు. వాళ్లు సాధార‌ణ ప‌రిస్థితుల్లో ఉండేందుకు వీలు క‌ల్పించారు.

ట్యాగ్స్​