తైవాన్​ పైకి 57 యుద్ధ విమానాలతో చైనా కవ్వింపులు

By udayam on January 9th / 6:40 am IST

తైవాన్ భూభాగం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్న చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. నెల రోజుల వ్యవధితో చైనా రెండోసారి ఈ విన్యాసాలు చేపట్టింది. చైనాకు చెందిన 57 యుద్ధ విమానాలను తాము గుర్తించినట్లు తైవాన్ చెప్పింది. వాటిలో 28 యుద్ధ విమానాలు తైవాన్ గగన తల రక్షణ ప్రాంతంలోకి ప్రవేశించాయని పేర్కొంది. తన సామర్థ్యాలను తెలిపేందుకే ఈ విన్యాసాలు చేపట్టామంది చైనా.

ట్యాగ్స్​