చైనాలో ఫ్లోటింగ్​ బుల్లెట్​ ట్రైన్​

గంటకు 620 కిలోమీటర్ల వేగం

By udayam on January 19th / 10:34 am IST

పట్టాల మీద నుంచి కొంచెం ఎత్తులో ఉండి ప్రయాణించే మాగ్లెవ్​ ట్రైన్​ చైనా తాజాగా ప్రదర్శించింది. దీని గరిష్ట వేగం గంటకు 620 కిలోమీటర్లు కావడం విశేషం.

జియోటాంగ్​ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ మాగ్లెవ్​ ట్రైన్​ను హై టెంపరేచర్​ సూపర్​ కండక్టింగ్​ టెక్నాలజీ ఆధారంగా నిర్మించారు. అతిపెద్ద భారీ అయస్కాంతాలు ఈ ట్రైన్​ను గాలిలో ఉండేలా నిలబెడతాయి.

దీంతో పట్టాల నుంచి వచ్చే రాపిడి కూడా లేకపోవడంతో ఇది అత్యంత వేగంగా దూసుకుపోగలదు.

ఈరోజు కేవలం 69 అడుగుల ఈ మ్యాగ్లెవ్​ ట్రైన్​ మోడల్​ను మాత్రమే ప్రదర్శించినప్పటికీ అతి త్వరలోనే ఈ ట్రైన్​ మొత్తాన్ని పరీక్షల నిమిత్తం సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.