చైనా: అది ‘ఎకనామిక్​ నాటో’ కూటమి

By udayam on May 24th / 8:57 am IST

జపాన్ వేదికగా అమెరికా తీసుకొచ్చిన ఇండో పసిఫిక్​ ఎకనామిక్​ ఫ్రేమ్​వర్క్​ను ‘ఎకనామిక్​ నాటో’ కూటమిగా చైనా అభివర్ణించింది. ఈ కూటమి కేవలం చైనా ఎదుగుదలను అడ్డుకోవడానికి అమెరికా పన్నిన కుట్రేనని చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యి సోమవారం వ్యాఖ్యానించారు. ఈ కూటమిలో భారత్​తో పాటు అమెరికా, జపాన్​, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్​, థాయిలాండ్​, వియత్నాం, ఫిలిప్పైన్స్​లు సభ్యదేశాలుగా ఉండనున్నాయి.

ట్యాగ్స్​