అరుణాచల్​లో చైనా గ్రామం!

త్సారి చు నదికి సమీపంలో నిర్మించినట్లు శాటిలైట్​ చిత్రాల నిర్ధారణ

By udayam on January 18th / 1:53 pm IST

అరుణాచల్​ ప్రదేశ్​ – చైనా సరిహద్దుల వద్ద భారత ఆధీనంలోని ప్రాంతంలో డ్రాగన్​ మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది.

అక్కడి ఎగువ సుబాన్సిరి జిల్లాలోని త్సారి చు నది వద్ద సుమారు 4.5 కిలోమీటర్ల ప్రాంతంలో ఓ చిన్న గ్రామాన్ని నిర్మించినట్లు ఎన్​డిటివి వార్తను ప్రచురించింది.

దీనిపై భారత ప్రభుత్వం తన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతం మొత్తం కేవలం ఆర్మీ అవసరాలకు మాత్రమే వినియోగించాలని భారత్​ చెప్తోంది.

అయినప్పటికీ 4.5 కిలోమీటర్ల ప్రాంతంలో 101 ఇళ్ళను డ్రాగన్​ నిర్మించడం సహించలేని చర్యగా భారత్​ పేర్కొంది.

cipahpm

2020 నవంబర్​ 1న తీసిన చిత్రాలు, 2019 ఆగస్ట్​లో తీసిన చిత్రాలను పక్కపక్కన పెట్టినప్పుడు ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ప్రస్తుతం అక్కడ ఎలాంటి నిర్మాణం జరుగుతున్నట్లు ఈ చిత్రాల్లో కనిపించడం లేదు. దీన్ని బట్టి ఈ గ్రామ నిర్మాణం గత ఏడాదిలోనే పూర్తి చేసేసినట్లు అర్ధమవుతోంది.

ఈ చిత్రాలపై కేంద్ర విదేశాంగ శాఖ సైతం స్పందించింది. ‘‘మేం అక్కడ చైనా నిర్మాణాలను గమనించాం. ఈ పనిని చైనా చాలా ఏళ్ళుగా చేపట్టినట్లు అర్ధమవుతోంది. దీనికి సరైన సమాధానం చెబుతాం” అంటూ వ్యాఖ్యానించింది.

అయితే మన ప్రభుత్వం సైతం చైనా సరిహద్దుల వద్ద మెరుగైన వసతులను కల్పించడానికి ప్రణాళికలు రచిస్తోందని.. దీంతో అక్కడి ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు సంభవిస్తాయని పేర్కొంది.