చైనాలోని ఉయ్ ఘర్ ముస్లింలపై జరుగుతున్న ఘోరాలు మనం ఇప్పటికే చాలా విన్నాం. ఈ క్రమంలో ఈ ఉయ్ ఘర్ సమాజంలోని పెళ్ళి కాని మహిళా ముస్లింలను అక్కడి అధికారులు బలవంతపు మత మార్పిడి పెళ్ళిళ్ళు జరిపిస్తున్నారన్న సంచలన విషయాన్ని ఉయ్ ఘర్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసింది. ఆ దేశ మీడియా, పాలసీ డాక్యుమెంట్లు, ఆంక్షలు విధించబడ్డ ప్రముఖులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. తూర్పు తుర్కిస్తాన్ కు చెందిన మగవారితో.. ఉయ్ ఘర్ ముస్లిం లలోని మహిళలకు బలవంతంగా పెళ్లిళ్ళు జరిపించడానికి ఓ ప్రభుత్వ ఏజెన్సీ కూడా పనిచేస్తోందని ఆరోపించింది.