చైనా పారిపోయిన లోన్ యాప్స్ డైరెక్టర్స్

రెడ్ కార్నర్​ నోటీసులు

By udayam on January 19th / 12:34 pm IST

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపి, ఎందరో ఆత్మహత్యలకు కారణమైన ఆన్‌లైన్ లోన్ యాప్స్ కంపెనీలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో సదరు లోన్ యాప్స్ డైరెక్టర్లు చైనాకు ఉడాయించారు.

వారిని తిరిగి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇలా చైనాకు పారిపోయిన డైరెక్టర్ల కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.

సైబర్ క్రైమ్ పోలీసులు.. కేంద్ర ప్రభుత్వ సహాయంతో వారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ చైనా కంపెనీలు ఇండియాకు చెందిన పలువురిని తమ డైరెక్టర్లుగా నియమించుకున్నాయి.

ఎలాంటి సమస్యలు వచ్చినా తమ మీదకు రాకుండా ఉండేందుకు తెలివిగా వ్యవహరించారు.

కాగా ఇప్పటికే 16 కంపెనీలపై పోలీసులు దాడులు చేసి మూసివేసారు. చైనాకు చెందిన కొందరితోపాటు ఇండియాకు చెందిన వాళ్ళతో ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాయి.

డబ్బుల కోసం కక్కుర్తి పడ్డ కొందరు ఇండియన్లు సదరు లోన్ యాప్స్ లో డైరెక్టర్లుగా చేరారు.ఈ కంపెనీలో ఉన్న అసలు డైరెక్టర్లను పట్టుకుంటే నిజాలు బయటకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే వందలకోట్ల రూపాయలు తరలిపోయాయని టాక్.