10,000 శాటిలైట్లు ప్రయోగించనున్న చైనా

ఎలన్​ మస్క్​ స్పేస్​ఎక్స్​ కు ధీటుగా డ్రాగన్​ ప్రయత్నాలు

By udayam on November 20th / 9:58 am IST

టెక్​ దిగ్గజం ఎలన్​ మస్క్​ స్టార్​లింక్​ ప్రాజెక్ట్​ ద్వారా భూమి లోయర్​ ఆర్బిట్​లోకి శాటిలైట్స్​ను పంపి అత్యంత వేగంగా ఇంటర్నెట్​ను అందివ్వాలని చేస్తున్న ప్రయత్నాలకు చైనా గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే స్టార్​లింక్​ ప్రాజెక్ట్​ కింద స్పేస్​ ఎక్స్​ 720 శాటిలైట్లను ప్రయోగించగా దీనికి పోటీగా చైనా 10,000 శాటిలైట్లను సిద్దం చేస్తోంది.

అమెరికాకు చెందిన ప్రైవేట్​ కంపెనీలు కానీ, స్పేస్​ ఎక్స్​ కానీ లోయర్​ ఆర్బిట్​ను శాటిలైట్లతో నింపడానికి ముందే తమ ప్రైవేట్​ కంపెనీలు ఆ పనిని పూర్తి చేయాలని చైనా ఆశిస్తోంది.

ఇందుకు సంబంధించి వచ్చే ఐదేళ్ళలో దాదాపు 10 వేల శాటిలైట్ల ప్రయోగాలకు సిద్ధం కావాలని చైనా ఏరోస్పేస్​ సైన్స్​ అండ్​ ఇండస్ట్రీ కార్పొరేషన్​ (సిఎఎస్​ఐసి) ప్రణాళికలు రచిస్తోంది.

ఇప్పటికే రద్దీగా మారిన లోయర్​ ఎర్త్​ ఆర్బిట్​లోకి చైనా ప్రయోగించే 10 వేల శాటిలైట్లు చేరితో మరింత రద్దీతో ఖాయమని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.