భారత్​కు రానున్న చైనా అధ్యక్షుడు

By udayam on February 23rd / 8:16 am IST

ఈ ఏడాది భారత్​లో జరిగే బ్రిక్స్​ సమావేశానికి చైనా అధ్యక్షుడు షి జింగ్​ పింగ్​ హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

లడఖ్​ వద్ద జరిగిన ఘర్షణ నేపథ్యంలో పూర్తిగా దెబ్బతిన్న భారత్​ – చైనా సంబంధాలను తిరిగి గాడిన పెట్టడానికి ఈ పర్యటన దోహద పడుతుందని ఇరుదేశాలు భావిస్తున్నాయి.

రొటేషన్​ పద్దతిన ఈ ఏడాది బ్రిక్స్​ మీటింగ్​ మన దేశంలోనే జరగనున్నాయి. అయితే ఇక్కడ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఈ సారి వేరే దేశంలో ఈ సమావేశాలు నిర్వహించాలని ముందుగా భావించినా చైనా మాత్రం భారత్​లోనే ఈ సమావేశాలు జరగాలని పేర్కొనడం గమనార్హం.

బ్రెజిల్​, రష్యా, ఇండియా, చైనా, సౌత్​ ఆఫ్రికా దేశాలు కలిసి బ్రిక్స్​ కూటమిగా ఏర్పడి ప్రతి ఏటా ఈ ప్రాంత అభివృద్ధికై చర్చిస్తుంటాయి.

ట్యాగ్స్​
Source: indiatoday