చైనాలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ దేశంలో ప్రతి ఏటా జరిగే చున్యున్ స్ప్రింగ్ ఫెస్టివల్‌కి ఈ ఏడాది విదేశాల నుంచి చైనీయులు భారీగా తరలి రానున్నారు. కోవిడ్ వ్యాప్తి రీత్యా గడచిన మూడేళ్లుగా.. చైనా సరిహద్దుల్ని మూసివేసింది. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత చైనా సరిహద్దుల్ని ఈ ఏడాది తిరిగి తెరిచింది. 40 రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్‌కి విదేశాల నుంచి వచ్చే చైనీయుల కోసం మూడేళ్ల తర్వాత ఆదివారం హౌకా చెక్‌పాయింట్‌ను తిరిగి తెరిచింది.